Breaking

Screenshots






Sunday, 17 January 2021

WHAT IS BHOGI ? ------- భోగి అంటే ఏమిటి ?

                           BHOGI

                                    భోగి

 What is Bhogi?

భోగి అంటే ఏమిటి ?

How did this Bhogi festival come about?

ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? 

What are the secrets behind bonfires and bonfires?
భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?




భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.

సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.

భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.





Bhogi or Bhogi festival is an important festival celebrated by the Andhras. Bhogi is the first day of the three-day Sankranthi festival celebrated by Andhras as a big festival. The Bhogi festival usually falls on January 13 or January 14. In the southern hemisphere, the sun moves slightly farther south of the earth day by day, moving farther and farther away from the earth in the southern hemisphere. People used to light bhaga bhaga burning fires for sega to withstand the cold weather.

The day before the epidemic of infection has a priority. It is called Bhogiparvam. But the word bhogamu means experience. Bhogamu is what we experience as happiness or what we get pleasure from experiencing. The day on which such pleasures are to be enjoyed is called bhogi. The real pleasure is to experience true happiness. Each one is a joy to the other. The pleasures of the common people are separated. If they can find worldly things it is a luxury. If you get bored with that thing get another thing. But what seems to be more than what is available, what is perfect bliss is the same true pleasure. Such indulgence is available because of yoga. That is why yogis can be bhogs. Such divine bliss is received by Amma Godadevi Andallamma today. That is the divine access. Taken by Ranganath. Received the grace of Ranganath. It is said that the name Bhogi is today defined in terms of devotional tradition as Amma inherited the boon of Kaivalyanandam which is said to be the association of Ranganath. Sagittarius is coming to an end with exactly this day. Next comes the month of Capricorn from Rehi according to the solar system. The entire Dhanurmasa fast is completed today and as a result the mother receives the blessings of the Lord.

Bhogi is the coldest day in winter. On this day the Andhras light fires and get cold, these fires are called bonfires. Palm leaves are mostly used for bonfires. The leaves are washed a few days before the bonfire and prepared for the bonfire. In many places, palm fronds are brought in and sold at home, especially for bonfires. In addition to these, useless old items that can be ignited in the fire are prepared the night before. The fires usually start in front of someone's house between 3 and 5 o'clock in the morning.

On the day of Bhogi festival, children are blessed with plums, hence these teeth are called Bhogi teeth and the blessings of Bhogi teeth are considered as the blessings of Srimannarayana.




‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. 

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం..


‣ "భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.

 పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.

సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.


‣ కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తునం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. 


ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.ప్రతీ దినము గృహద్వారం  ముందు  వరి  పిండితో,,  ఈ  విధముగా  అనుకొనుచు   మూడు కర్రలుగా వేయవలెను,,, 1)శాంతి సుఖ ప్రాప్త్యర్థం దుఃఖ నివారణార్థం  2) సర్వ పాప,  రోగ, ఋణభాధా  నివారణార్థం, ఆయురారోగ్య ఐశ్వర్య  ప్రాప్యర్ధం  3) భూత ప్రేత  పిశాచ  భాధా        నివారణార్ధం    ఆధ్యాత్మిక  ఆనంద భక్తి  ఙ్ఞాన  వైరాగ్య  ప్రాప్యర్ధం.,    అని మూడు  కర్రలు  ముగ్గుతో వేయాలి,  మరియూ చీమలకు, కొన్ని కీటకములకు   ఆహారము  కూడా  సమర్పించినట్లు అగును.


      We celebrate Bhogi as the first day of the three-day Sankranthi festival which is celebrated as a big festival.

In the southern hemisphere, the sun moves slightly farther south of the earth day by day, and as it moves farther away from the earth in the southern hemisphere, the earth becomes colder. People used to light bhaga bhaga for the sega to withstand the cold weather. Everyone knows that. So let's find out the myth and "scientific reasons" why bonfires are lit on this festival day.


The word bhogi is derived from the Sanskrit word "bhug". Bhogam means happiness.

 Our legend has it that the Bhogi festival came into being on this day as a sign that Godadevi was immersed in Sri Ranganadhaswamy and enjoyed the bhoga. When he was given the opportunity to come to earth and bless the people. It is said in our mythology that bonfires are lit to invite the arrival of the emperor. This is the holy day when Lord Krishna teaches Indra a lesson and hears Govardhana mountain. Legend has it that this was the day when the cursed Basavana, the vehicle of God, was sent to earth and the god of the peasants came down to earth.

Generally everyone says that it is winter so they light fires for warmth. But in fact bonfires are not only for warmth, but also for health. Sagittarius is made of nuts that are placed in front of the house all over the ground. They themselves are used in these bonfires. Burning desi cow dung nuts purifies the air. The germs are extinct. Excess oxygen is released into the air. Inhaling its air is good for health. Many diseases spread during the winter. Many respiratory diseases, in particular, are contagious. It works as a medicine for them. Bark of medicinal trees like Ravi, Mango, Medi etc. is placed in it to make the bonfires bigger. They add cow ghee for roasting. For every 10 grams of cow dung laid in the fire, 1 tonne of oxygen is released. The air released by burning these medicinal herbs together with cow ghee and cow dung is very powerful. It enters the 72,000 nodes of our body and cleanses the body. One person can be given the appropriate medicine if they get sick, while it is almost impossible to provide medicine to everyone if they get sick. Some of them may even be poor who cannot afford healing. All of our elders who thought of all this brought together the tradition of participating in bonfires. The air coming from it gives health to everyone. The unification of all, regardless of caste, reduces the distance between people and enhances solidarity. It is, in a way, worship of the god of fire, and in another way the worship of the god of air by purifying the air.


‣ But we are burning our health in the name of fashion and creativity by pouring petrol on rubber tires and burning them, calling them toxic gases and polluting them. Destroying the environment. We bring in new diseases as well as existing ones. Now we hear that burn useless objects in bonfires. The queen items for work are not the plastic covers and wires that are in the house.


Here we have to remember one thing about history. The British troops who did not want to invade India but destroyed the wealth of knowledge in our India, under the pretext of burning old goods in bonfires, innocent people have been preserving the heritage of hundreds of years by burning the oldest palm leaf texts. In fact, it is not the old things that burn in the bonfire, but the bad habits and bad qualities in us. Only then will our troubles go away and our mental health and success will come. To cure ghost vampire affliction is to attain spiritual bliss, devotion, enlightenment, and so on.






‣ భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుస్సుకుందాం...
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.






‣ మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అసిర్వాదిస్తారు.

మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.




      Let's find out the meaning of pouring Bhogi teeth ...
Regi teeth are poured on children under the name of Bhogi teeth on the day of Bhogi The Sanskrit name for the regi tree is Badari Vriksham. Regi trees, copper fruits are every form of Srimannarayana Swami. It is a favorite fruit of the sun. Coins with plums bearing the shape, color and name of the sun are poured on the child's head. Our elders believe that by pouring them on the head, the grace of Sri Lakshmi Narayana will be upon our children and the focus on the children will be removed and they will contribute to their growth.


      The Brahma hole which is invisible to our external eyes is at the top of our head. If these bhogi fruits go and stimulate that brahmarandra, the children will become wise. Plums absorb and store most of the vitality of the sun's rays, so pouring them on the head can have a beneficial effect on electricity, body, and health.

     There are many meanings, implications and mysteries behind each of our traditions. It is foolish to think that customs and traditions are superstitious because they do not know them. If we know their values, they will become our guides.

                                                                                                           ----MAHATHI

No comments:

Post a Comment

Adbox