Breaking

Screenshots






الأحد، 17 يناير 2021

రాయల చెరువు - శ్రీ కృష్ణ దేవరాయ యుగంలో ఒక భాగం. / RAYALA CHERUVU - A part in era of sri krishnadevaraya.

 

                         రాయల చెరువు

        శ్రీ కృష్ణ దేవరాయ యుగంలో ఒక భాగం                          
                      RAYALA CHERUVU

                                      A part in era of sri krishnadevaraya



[Readers will notice that the translation was done with Google Translate

తర్జుమా గూగుల్ త్రన్స్లాటే తో జరిగింది పాఠకులు గమనించగలరు ]







     ఈ చెరువును శ్రీకృష్ణదేవరాయల 16వ శతాబ్దంలో తవ్వించారు. ఈ చెరువు 500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది. ఈ చెరువు కట్ట యొక్క నిర్మాణం చూస్తే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం  ప్రతిబింబిస్తుంది.


     The pond was dug by Sri Krishnadevaraya in the 16th century. The pond is spread over 500 acres. The structure of this pond embankment reflects the excellent engineering skill.

ఈ చెరువుకు ఎక్కువభాగం సహజసిద్ధమైన ఆనకట్టగా కొండలు ఉన్నాయి. రెండు కొండల మధ్య భాగాన్ని మానవ నిర్మితం గా నిర్మించారు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన గా మనం పరిగణించవచ్చు.

Most of the pond is a natural dam with hills. The part between the two hills was built man-made. We can consider it a wonderful idea.


చెరువు కట్ట నిర్మాణంలో మధ్యలో లోహపు గోడను సీసంతో నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. కట్టపై నుండి చెరువులోకి దిగడానికి కట్టడం యొక్క రాళ్ళు ఉపయోగపడతాయి. ఈ చెరువులో అనేకమంది చేపలు పడుతుంటారు ఈ చేపలకు మంచి గిరాకీ ఉంది.






                                            SRI KRISHNA DEVARAYA



Locals say the metal wall in the middle of the pond embankment structure was built with lead. The stones of the masonry are useful for descending from the embankment into the pond. Many fish are caught in this pond and there is a good demand for this fish.

ఈ చెరువు కట్ట నిర్మాణం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి స్థానికుల కథనం ప్రకారం................

     There are many stories circulating about the construction of this pond embankment according to the locals ................

     శ్రీకృష్ణదేవరాయలు చెరువు కట్ట నిర్మాణం గురించి తమ గురువైన వ్యాసరాయలు ను సంప్రదిస్తాడు.వ్యాసరాయలు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోతారు.

      Sri Krishnadevaraya consults the Vyasaraya on their guru about the construction of the pond embankment. The Vyasaraya leave without giving any answer.



                                                                       VYASARAYA


      పన్నెండు సంవత్సరముల తరువాత వ్యాస రాయలు శ్రీకృష్ణదేవరాయల తో చెరువు యొక్క నిర్మాణం గురించి ప్రస్తావిస్తాడు అన్ని సంవత్సరాలు గాను శ్రీకృష్ణదేవరాయలు తన గురువుని అడగను లేదు ఆయన చెప్పనూ లేదు.చెరువు కట్ట నిర్మాణం కోసం ఒక దివ్యమైన ముహూర్తం ఉంది ఇది 12000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది.ఈ ముహూర్తంలో పనిని చేసినట్లయితే స్వల్ప మానవ ప్రమేయంతో సహజసిద్ధంగా పూర్తవుతుంది అని వ్యాసరాయలు చెబుతారు.

     Twelve years later Vyasa Raya mentions the construction of the pond with Sri Krishnadevaraya.
There is a glorious moment for the construction of the pond embankment which comes only once in 12000 years. The essays say that if the work is done at this moment it will be completed naturally with little human intervention.

   
      రాబోవు పూర్ణిమ నాడు ఒక ధైర్యవంతుడు అయిన బోయవాడిని నాకు సహాయకుడిగా పంపు. మిగతా జరగవలసిన కార్యక్రమాన్ని నేను నడిపిస్తాను. అని వ్యాసరాయలు సెలవు ఇచ్చారట. దేవరాయలు అలాగే అక్కడి నుంచి సెలవు తీసుకుని బయలుదేరి వెళ్లిపోయారు.

     Send me a brave boy who will be my helper on the coming Purnima. I’ll run the rest of the event. That 's it. The Devaraya took leave from there as well and left.

     పూర్ణిమ రోజు  బోయవాడు వ్యాసరాయలు దగ్గరికి వచ్చి ప్రణామం చేసి నిలుచున్నాడు. అప్పుడు వ్యాసరాయలు నేను దర్భను పరుచుకుంటూ వెళ్తాను, నీవు దర్భ కనిపించకుండా మట్టిని వేస్తూ రావాలి, ఎటువంటి మార్పులు ప్రకృతిలో సంభవించినా నువ్వు
నువ్వు పనిని నిలుప కూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు మీకు ఎటువంటి ఆపదా రాదు, నీ ప్రాణాలకు పూచీ నాది అని చెప్పారట. 

     On the day of Purnima, the boy comes near the Vyasaraya and bows down. Then the essays I will go to Darbha, you have to keep the soil invisible to Darbha, no matter what changes occur in nature
You must not stop working, you must not look back, you will not be in any danger, you will be guaranteed your life.

     అలాగే స్వామి అన్నాడు బోయవాడు.వ్యాసరాయలు సంకల్పబలంతో ముహూర్తబలం తోడై దూరంగా ఉన్న కొండలు వాటంతట అవే కదులుతూ దగ్గర గా వస్తున్నాయి, ధైర్యంతో పని చేస్తూ ముందుకు వెళుతున్నాడు బోయవాడు. ఇంతలో వెనుక నుండి ధన ధన మంటూ భయంకరమైన శబ్దం చేసుకుంటూ పిడుగు తమపైనే పడుతుందా అన్నట్లు ఒక విపరీతమైన పెద్ద గుండు దొర్లుకుంటూ వస్తుంది. గుండె ధైర్యం సరిపోక వెనక్కి తిరిగి చూశాడు బోయవాడు ఎక్కడికి అక్కడే కొండలు నిలిచిపోయాయి వస్తున్న గుండు కూడా అక్కడే ఆగిపోయింది.






     Swami also said that Boyavadu. Meanwhile a huge shave comes tumbling from behind, making a terrible noise and wondering if the thunderbolt will hit them. When the heart was not brave enough, he looked back and saw that the hills had stopped and the razor had stopped.

ఇది చూసిన గురువుగారు నేరుగా వచ్చి బోయవాడి చెంప మీద బలంగా ఒకటి ఇచ్చారు. ఆ సమయంలో అలాగేనడుచుకుంటూ రాజదర్బార్ వైపు సాగిపోతున్నాడు గురువు. గురువు రాజ మహల్ చేరుకొని రాయలవారు చెంప మీద బలంగా ఇంకొక దెబ్బ ఇచ్చాడు.

     The teacher who saw this came straight and gave the boy a strong one on his cheek. At that time, the teacher was walking towards the Rajdarbar. The Guru reached the Raja Mahal and the scribes dealt another blow on the cheek.

     ధైర్యవంతుడుని  పంపమంటే ఇలాంటి పిరిలో వాడిని  పంపించావ్ ఏమిటి అని రాయలవారితో గద్దించాడు. స్వామి క్షమించండి ఈ కార్యానికి ఎవరు సరి పోతారో నాకు అర్థం కాక, బోయవాని విషయంలో నేను అక్కడికి వచ్చాను కావాలంటే చూడండి మీరు.  అని మరొక చంప  చూపించాడు.అది ఎర్రగా కమిలిపోయి ఉంది.  మీ ఆలోచన గమనించి మీ కన్నా ముందే రాజదర్బార్ చేరుకున్నాను అని వినమ్రంగా సెలవిచ్చాడు శ్రీ కృష్ణ దేవరాయలు. 

     He shouted at the scribes, "What is the point of sending a brave man like this?" Sorry Swami I do not understand who is right for this task but in the case of Boya I have come there to see if you want. Showed another killer. It was flushed red. Sri Krishna Devarayalu politely said that he noticed your idea and reached Rajdarbar before you.

     తరువాత గురువు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.


     Then the Guru left without saying anything. 

      తిరిగి 12 సంవత్సరముల తరువాత ఒక రక పాటి ముహూర్తంలో మానవ ప్రమేయంతో దగ్గరగా వచ్చిన రెండు కొండల మధ్య భాగాన్ని ఆనకట్ట తో కలిపి నిర్మించారు.

     Back 12 years later, in a kind of moment, the middle part of the two hills, which came close together with human intervention, was built along with the dam.

      స్థానికుల కథనం ప్రకారం ఈ చెరువు నిర్మాణ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు పనిచేసే వారికి జీతం ఖజానా నుండి ఇవ్వలేదట. ఉదయం పని లోకి వచ్చి సాయంత్రం వరకు నిజాయితీగా పని చేయాలి. సాయంత్రం అక్కడికి కొంత దూరంలో కల స్వర్ణముఖి నదీ తీరాన, ఇసుక తిన్నెల లో ఇసుకను కుప్పగా చేతితో తోసి,  తిరిగి మట్టి ని పక్కకు తోయాలి,  వారి శ్రమకు తగ్గ బంగారు నాణేలు లభించేవి అట. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే లభించేదట, ఎక్కువగా ని తక్కువగా ని లభించక పోగా పనిచేయని వారికి మట్టి తప్ప మరేమీ లభించదు.







 స్వర్ణం లభించేది కాబట్టి
స్వర్ణముఖి అను పేరును ఈ నదికి సార్థకమైంది.

     According to the locals, during the construction of the pond, the salaries of those who worked for Sri Krishnadevaraya were not paid from the treasury. Come into work in the morning and work honestly until the evening. In the evening, on the banks of the Swarnamukhi River, some distance away, they had to pile the sand in the sand dunes by hand and push the soil back to the side, where they could find gold coins worth their labor. Their hard work pays off little, and those who do not work without getting more or less get nothing but soil.

 Since gold is available
Swarnamukhi is the name given to this river.
                               -----------------------------------------------------------

     స్వర్ణముఖి 

     Swarnamukhi



     దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో  ఒకటి స్వర్ణముఖి. దక్షిణకాశీగా పిలవబడే శ్రీ కాళహస్తి ఆలయం ఈ నదీతీరంలో వెలసింది. 25 million cubic metres సామర్ధ్యం కల కళ్యాణి డ్యాం, తిరుపతి సమీపంలో ఈ నది ఉపనది అయినటువంటి kalyani నదిపై, నిర్మించబడింది. ఈ డ్యామ్ ను 1977 లో నిర్మించారు. ఈ నది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వద్ద పుట్టి 130 కిలోమీటర్ల దూరం ప్రవహించి నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో కలుస్తుంది.

     Swarnamukhi is one of the flowing rivers in South India. Sri Kalahasti Temple, also known as Dakshinakasi, is located on the banks of the river. The Kalyani Dam, with a capacity of 25 million cubic meters, was built on the Kalyani River, a tributary of the river near Tirupati. The dam was built in 1977. The river originates at Chandragiri in Chittoor district and flows for 130 km and joins the Bay of Bengal in Nellore district.

     ఈ నదీ తీరంలో అనేక ఆలయాలు ఉన్నాయి.  చంద్రగిరి వద్ద ముక్కోటి ఆలయం,  చిగురువాడ వద్ద స్వర్ణముఖీ పార్వతీ పరమేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి వద్ద శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నారు.

     There are many temples on the banks of this river. Mukkoti Temple at Chandragiri, Swarnamukhi Parvati Parameswara Temple at Chiguruwada and Srikalahasti at Srikalahasti.

     శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కల అష్టదిగ్గజ కవులలో ఒకరైన ధూర్జటి,  శ్రీ కాళహస్తిలో వెలసిన శివుని భక్తి పారవశ్యంతో,  శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. ఈయన రచనలలో స్వర్ణముఖీ నదిని  మోగల ఏరుగా వర్ణించాడు.

     Dhoorjati, one of the eight poets in the court of Sri Krishnadevaraya, wrote the Srikalahastishwara Shatakam with the devotional ecstasy of Lord Shiva in Sri Kalahasti. In his writings, he described the Swarnamukhi river as the Mogal Canal.
                                                

                                                       --------------------------------------------

     ఈ చెరువులో ఏడు అంతస్తుల భవనం కలదు.  తరచూ చెరువులోకి నీళ్ళు రావడం, పూడికలు  తీయక పోవడం, వలన కేవలం రెండు, అంతస్తులు  మాత్రమే కనబడుతున్నాయి.  ఈ చెరువుకు గల చుట్టుపక్కల కొండలు ఈ కట్ట నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళు కనిపిస్తాయి.

     The pond has a seven storey building. Frequent water intrusion into the pond, causing overgrowth, leaving only two floors visible. The surrounding hills surrounding the pond show the stones used in the construction of the embankment.

     ఈ చెరువును ఆనుకొని సూరావారి పల్లె, గొల్లపల్లె, చిట్టత్తూరు, కాలేపల్లి, రాయలచెరువు, కుప్పం బాదూరు మొదలగు గ్రామాలు కలవు.

Adjacent to this pond are the villages of Suravari Palle, Gollapalle, Chittathoor, Kalepally, Rayalacheruvu, Kuppam Badur etc.

ఈ చెరువు నీరు బయటకు పోవడానికి కొన్ని మార్గాలు అనగా తూములు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది గుర్రపు తూము అంటారు. ఈ తూములో అశ్వం పై రాజు కూర్చుని రాజ ఛత్రం పట్టుకుని వెల్లేటంత పెద్దదిగా ఉంటుంది అందుకని దీన్ని గుర్రపు తూము అంటారు.

There are some ways to get water out of this pond i.e. sluices. The most important of these is called the horse sluice. The sluice is so large that the king sits on a horse and grabs the royal canopy, so it is called a horse sluice.

చెరువుకట్ట కు పశ్చిమం వైపు భాగంలో కొన్ని మీటర్ల దూరం వరకు సన్నటి దారి ఉంటుంది. దీనికి ఇరువైపులా కొన్ని అడుగుల ఎత్తు ఉండే రాతి గోడ ఉంటుంది. కొంత దూరంలో దీనిని అనుసంధానిస్తూ బావిలాంటి గుండ్రటి రాతి కట్టడం ఉంటుంది.దీని మధ్యలో ఇనుప కడ్డీ ఒకటి ఉంటుంది. ఇది 90 డిగ్రీల కోణంతో ఉంటుంది.






On the west side of the pond there is a narrow path up to a distance of a few meters. It has a stone wall a few feet high on either side. Connecting it at some distance is a round stone structure like a well. In the middle of this is an iron rod. It has a 90 degree angle.

ఈ బావి యొక్క వ్యాసార్థం అన్నివైపులా సమానంగా ఉంటుంది. ఈ ఇనుప కడ్డీకి 🗜️ క్లంప్ తగిలించి, ఈ బావి పై ఎద్దును గానుగెద్దులా తిప్పడం చేసేవారు. దీనివల్ల కడ్డీ తిరిగి, ఎన్నో అడుగుల లోతులో ఉన్న రాతి బండలు తెలుసుకోబడి, నీరు బయటకు పంపబడుతుంది. దీని ద్వారా నీటి మట్టం పెరగకుండా, చెరువుకు ప్రమాదం రాకుండా, అడ్డుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియ ఇప్పుడు క్రియాశీలకంగా లేదు.

The radius of this well is equal on all sides. A clamp was attached to the iron rod and a bull was used to rotate it over the well. This causes the rod to return, detect the boulders several feet deep, and send the water out. This will prevent the water level from rising and endangering the pond. Unfortunately this process is not active right now.

చెరువు కట్ట ను ఆనుకొని రెండు బలమైన రాతి స్తంభాలు ఉంటాయి. మొదటి స్తంభంపై చేప బొమ్మ చెక్కబడి ఉంటుంది. రెండవ స్తంభంపై తాబేలు బొమ్మ చెక్కబడి ఉంటుంది. నీటిమట్టం చేప బొమ్మను తాకితే సురక్షితం కానీ అప్రమత్తం అవ్వాలని సూచన, అదే నీటి మట్టం పెరిగి తాబేలు బొమ్మను తాకితే అది ప్రమాదాన్ని సూచిస్తుంది.

Adjacent to the pond embankment are two strong stone pillars. On the first pillar is engraved a fish toy. The tortoise toy is engraved on the second pillar. The water level is safe to touch if the fish touches the toy, but it is a warning that if the water level rises and the turtle touches the toy it is dangerous.


ఇది నేటి సమాచారం రాయలవారికి చెందిన మరింత సమాచారంతో మల్లి కలుద్దాం . ధన్యవాదాలు.


     Let's meet again with more information from today's information writers.

Thank you. 

------------------------------------------------
LOCATION OF RAYALACHERUVU
------------------------------------------------

https://goo.gl/maps/6qBgwjRgtazbbyzA7
                                                                                                 ------MAHATHI

ليست هناك تعليقات:

إرسال تعليق

Adbox