Breaking

Screenshots






الاثنين، 18 يناير 2021

శ్రీకృష్ణదేవరాయలు - Krishnadevaraya

      

                        శ్రీకృష్ణదేవరాయలు

                          Krishnadevaraya

 


     శ్రీకృష్ణదేవరాయలు 1471 లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసనాయకుడు, నాగలాంబ.  ఈయన గురువు వ్యాసరాయలు. 20 సంవత్సరముల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయనకు ఇద్దరు భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి. ఈయన తుళువ వంశానికి చెందిన వాడు. ఈయన మంత్రి తిమ్మరుసు, తిమ్మరుసును పితృసమానునిగా , అప్పాజీ అని ఎంతో గౌరవంతో పిలిచేవాడు.

       Sri Krishnadevaraya was born in 1471. His parents were Narasanayaka, Nagalamba. His teacher essays. He ascended the throne at the age of 20. He has two wives, Thirumaladevi and Chinnadevi. He belongs to the Thuluva clan. His minister is Timmarusu. Thimmarusu was called by the patriarch, Appaji, with great respect.

 

     శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రాజయిన నాటికి పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి వయసులో చిన్నవాడు అయినా నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కలిగినవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.

     Circumstances were chaotic as Sri Krishna Devaraya reigned over the kingdom Sri Krishna Devaraya, who was young but had prominent leadership qualities.




     సముద్ర తీర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొన్నారు.  మరోవైపు ఒడిస్సా ప్రాంతం నుండి బహమనీ సుల్తానులు చిన్నచిన్న రాజ్యాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నారు. విజయనగర రాజ్యానికి సైనికబలం కూడా అంతంత మాత్రంగా ఉంది.

     The coastal area was occupied by the Gajapats. The Bahmani sultans, on the other hand, conquered small kingdoms from the region of Odisha and incorporated them into their kingdom. The military strength of the Vijayanagara kingdom was also limited.



     ఇట్టి పరిస్థితుల్లో తాను రాజైనప్పటి నుండి, అనగా 1709 నుండి మూడు సంవత్సరాలు సైన్యాన్ని విపరీతంగా పెంచి,  సుశిక్షితులుగా తయారుచేశాడు. అశ్వ, రథ, గజ, పదాతి దళాలను సుశిక్షితులుగా, రాజ్యం కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని ధీరులుగా,  రాజ్య విధేయులుగా తీర్చిదిద్దారు.

     Under these circumstances he greatly enlarged and trained the army for three years, from 1709, when he became king. The cavalry, chariot, yard, and infantry were trained and trained to be valiant and loyal to the kingdom.


 



     ఇక్కడ, రాయల వారి మేధస్సు, సైనిక వ్యవహార దక్షత మనకు అర్థమవుతుంది. ఇదే కాలంలో గోవాలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసి ఉన్న పోర్చుగీసు వారితో ఆయుధాలు, మొదలైన వ్యవహారాలు నడిపిస్తూ, సంబంధాలను మెరుగుపరుచుకున్నాడు.  శత్రుదుర్భేద్యమైన నిర్మాణాలు చేయటంలో భారతీయ మరియు పోర్చుగీసు వాస్తుశాస్త్రజ్ఞులను  ఉపయోగించాడు.

      Here, we understand the intelligence and military efficiency of the royals. During the same period he improved relations with the Portuguese, who had established temporary residences in Goa, dealing with arms, etc. He used Indian and Portuguese architects to build fortified structures.



 


     ఒకవైపు సైన్యాన్ని బలపరచుకుంటూనే, మరోవైపు రాజ్యంలో ప్రజల మౌలిక వసతులకు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు.  వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చెరువులు, కాలువలు త్రవ్వించాడు. అన్ని వర్గాల వారిని ఆదరించి, ప్రోత్సహించాడు.  ఆ రోజుల్లో విజయనగర ఆదాయం 240 కోట్ల రూపాయలుగా ఉండేది.  అచిర కాలంలోనే శత్రుదుర్భేద్యమైన విజయనగరంగా తన విజయనగరాన్ని తీర్చిదిద్దాడు.

 


     While strengthening the army on the one hand, on the other hand he gave priority to the infrastructure and agriculture of the people in the kingdom. He dug ponds and canals without disturbing agriculture. He supported and encouraged people from all walks of life. Vijayanagara's revenue in those days was Rs 240 crore. Achira soon transformed his Vijayanagara into an invincible Vijayanagara.



 


     సైన్యాన్ని సంపూర్ణంగా సిద్ధం చేసుకున్నాక, తొలిసారి 1512 లో దక్షిణ భారతదేశ దండయాత్రకు బయలుదేరాడు.  కావేరీ నదీ తీరంలోని శివపట్నం ను జయించి,  తన విజయాన్ని ప్రారంభించాడు. తదుపరి ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు మొదలైన ప్రాంతాలు జయిస్తూ  తన విజయ పరంపరను కొనసాగించాడు.  ఇంకా మధుర, తిరునగర్, తిరుచిరాపల్లి మొదలగు వాటినికూడా జయించి, విజయనగరంలో కలిపాడు. దక్షిణ భారతదేశంపై సంపూర్ణ ఆదిపత్యాన్నినెలకొల్పాడు.

     When the army was fully prepared, he first set out on an invasion of South India in 1512. He conquered Shivapatnam on the banks of the Kaveri River and began his conquest. He continued his winning streak by conquering the next places like Ummathur, Karnataka, Mysore etc. He alsoconquered Mathura, Thirunagar, Tiruchirappalli and other places and annexed Vijayanagar. Established absolute dominance over South India.

 



     ఉదయగిరి దండయాత్రలతో 1513లో ఉత్తర భారతదేశం పై కూడా తన విజయ పతాకాన్ని రెపరెపలాడించాడు . తరువాత వరుసగా కొండవీడు, నల్గొండ మొదలైన అనేక ప్రాంతాలను జయించాడు.

     Udayagiri also hoisted his banner of victory over northern India in 1513 with invasions. Later he conquered many places like Kondaveedu and Nalgonda respectively.


 



     1520లో బీజాపూరు దండయాత్రకు సిద్ధమయ్యాడు.బీజాపూర్ సుల్తాన్ అయినా ఇస్మాయిల్ ఆదిల్షా, అప్పట్లో 900 ఫిరంగులు కలిగి ఉండేవాడు. అయినప్పటికీ రాయల వారి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. 

In 1520, Bijapur prepared for an invasion.Ismail Adilshah, the Sultan of Bijapur, had 900 artillery pieces at the time. Yet the royals were utterly defeated at their hands.


 



     శ్రీకృష్ణదేవరాయలు నాటి ఢిల్లీ సుల్తాన్ కన్నా ఎక్కువ సైన్యాన్ని కలిగి ఉండేవాడు. మొత్తం ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉన్న సైన్యం కేవలం శ్రీకృష్ణదేవరాయలు తన రాజధాని అయిన  హంపిలో మోహరించిన సైన్యానికి సమానం.అందుకే అప్పటి ఢిల్లీ సుల్తాను కూడా శ్రీకృష్ణదేవరాయలకు భయపడేవాడు. పైగా 900 ఫిరంగులు కలిగిన బీజాపూరు సుల్తాను ఓటమి కూడా ఢిల్లీ సుల్తానులో మరింత భయాన్ని కలిగించింది.

     He had more troops than the Delhi Sultan of Sri Krishnadevaraya. The entire army near the Sultan of Delhi was simply the same as the army deployed by Sri Krishnadevaraya in his capital, Hampi.That is why even the then Sultan of Delhi was afraid of Sri Krishnadevaraya. The defeat of the Bijapur Sultan, who had more than 900 artillery pieces, also caused further fear among the Delhi Sultan.

 



     బీజాపూర్ తర్వాత రాయచూర్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయపరంపర తో విజయనగర సామ్రాజ్యం సువిశాల సామ్రాజ్యంగా అవతరించింది.  అందుకే కృష్ణ దేవా రాయల వారి విజయగాధలు నేటికీ మార్మోగుతున్నాయి.

     Bijapur later captured Raichur. With this conquest, the Vijayanagara Empire became a vast empire. That is why the success stories of Krishna Deva Raya are still circulating today.

 


     శ్రీకృష్ణదేవరాయలు యుద్ధ తంత్రాలు తెలిసిన ప్రభువు మాత్రమే కాదు, గొప్ప కళాపోషకుడు కూడా. ఈయన స్వయాన కవి.

     Sri Krishnadevaraya was not only a lord who knew the tactics of war, but also a great artist. He is a self-made poet.

     

 


 
     ఈయన నడిపే సభ పేరు భువన విజయం. ఇందులో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. శ్రీ కృష్ణదేవరాయలు యొక్క పరిపాలనా కాలాన్ని తెలుగు సాహిత్య స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఈయన సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద, ఇంకా అనేక రచనలు చేశారు. 

     The name of the assembly he runs is Bhuvana Vijayam. It consisted of octogenarian poets. The reign of Sri Krishnadevaraya is known as the golden age of Telugu literature. He wrote Jambavati Kalyanamu in Sanskrit, Amuktamalyada in Telugu and many more.

     
     ఈయన గురువు వ్యాసరాయలు.  ఈయన  వైష్ణవ మతాన్ని అనుసరించారు. దేవరాయలు తిరుపతి, కంచి, అహోబిలం, శ్రీ కాళహస్తి, సింహాచలం, ఇంకా అనేక పుణ్యక్షేత్రాలలో గోపురాలు మరియు అనేక మండపాలు నిర్మించారు. విజయనగరం, రోమ్ నగరం వలె బహుసుందరమయిన నగరమని, అప్పటి విదేశీ యాత్రికుడు డొమింగో పేస్ పేర్కొన్నాడు. విజయనగర సామ్రాజ్యంలో బంగారం, వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఈయన దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగును కీర్తించారు. 

     His teacher essays. He followed the Vaishnava religion. Devarayas built gopurams and many pavilions in Tirupati, Kanchi, Ahobilam, Sri Kalahasti, Simhachalam and many other shrines. Domingo Pace, a foreign traveler at the time, claimed that Vijayanagar was as beautiful a city as Rome. In the Vijayanagara Empire, gold and diamonds were piled up and sold. He glorified Telugu as Telugu Lessa in the vernacular.

 

     ఈయన గొప్ప చక్రవర్తి, పరిపాలనాదక్షుడు, కవి, కళాపోషకుడు,  దానశీలి ఓటమి ఎరుగని మహారాజు.

     He was a great emperor, administrator, poet, patron saint, and generous Maharaja.

 


     శ్రీ కృష్ణ దేవరాయలు తన ఆస్థానంలో కళాకారులు, పండితులు, విద్వాంసులు, వాగ్గేయకారులు, ఇలా ఎంతోమందిని పెంచి పోషించారు. వీరు సాహిత్య రంగానికి ఎనలేని కృషి చేశారు.  ఈయన కన్నడ ప్రాంతానికి చెందిన వాడైనా అధికంగా తెలుగు ప్రాంతంలోని రాజ్యవిస్తరణ చేశాడు.  ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని  తెలుగులోనే రచించాడు.


     Sri Krishna Devaraya nurtured many artists, scholars, scholars and lyricists in his court. They have contributed immensely to the field of literature. Although he belonged to the Kannada region, he mostly expanded his kingdom in the Telugu region. He wrote a book called Amuktamalyada in Telugu.

                                    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
                                    తెలుగు వల్లభుండ తెలుగొకండ
                                    ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
                                    దేశ భాషలందు తెలుగు లెస్స
                                                                                    —శ్రీ కృష్ణదేవ రాయలు


                                        Teluga dēlayanna dēśambu telugēnu
                                        telugu vallabhuṇḍa telugokaṇḍa
                                        ellavāru vinaga erugavē bāsāḍi
                                         dēśa bhāṣalandu telugu les'sa         —śrī kr̥ṣṇadēva rāyalu




అనుబంధం

Appendix


అష్టదిగ్గజాల పేర్లు

Names of Ashtadiggajas


1. అల్లసాని పెద్దన. 
2. నంది తిమ్మన. 
3. ధూర్జటి. 
4. మాదయ్యగారి మల్లన. 
5. అయ్యలరాజు రామభద్రుడు. 
6. పింగళి సూరన. 
7. రామ రాజ భూషణ. 
8. తెనాలి రామకృష్ణ. 


1. Allasani is peddaa.
2. Nandi Thimmana.
3. Dhurjati.
4. Madayyagari Mallana.
5. Ayyalaraju Ramabhadra.
6. Pingali Surana.
7. Rama Raja Bhushan.
8. Tenali Ramakrishna.



వీరిలో తెనాలి రామకృష్ణ కవి వికటకవి గా సుప్రసిద్ధుడు.

Tenali Ramakrishna is one of the most famous poet as vikatakavi.




దేశ భాషలందు తెలుగు లెస్స
                                                                                    —శ్రీ కృష్ణదేవ రాయలు


                                                                                                   ------------MAHATHI 


هناك 3 تعليقات:

Adbox